Nara Brahmani: తెలుగు రాష్ట్రాల్లో మహిళల ప్రగతికి నాటి టీడీపీ ప్రభుత్వం వేసిన పునాదులే కారణం: నారా బ్రాహ్మణి

  • మంగళగిరిలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం
  • మహిళలతో ముఖాముఖి
  • పిల్లలను చూసుకోవాలన్నా, పరిశ్రమలు నడపాలన్నా మహిళలకే సాధ్యమని వెల్లడి
Nara Brahmani says TDP has laid foundation for women development in Telugu states

ఇంట్లో పిల్లలను చూసుకోవాలన్నా, పరిశ్రమలను నడపాలన్నా అది మహిళలకే సాధ్యమని నారా బ్రాహ్మణి అన్నారు. తగినంత ప్రోత్సాహం అందిస్తే ఏ రంగంలోనైనా మహిళలు అద్భుతాలు సృష్టిస్తారని తెలిపారు. తన భర్త నారా లోకేశ్ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి వైష్ణవి ఫంక్షన్ హాల్ లో జరిగిన స్త్రీ శక్తి, మహిళా మిత్ర, డ్వాక్రా మహిళలతో ఆమె సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో మహిళలు సాగిస్తున్న ప్రగతి పథానికి తెలుగుదేశం ప్రభుత్వం వేసిన పునాదులే కారణమని స్పష్టం చేశారు. "ఎన్టీఆర్ గారు మహిళలకు ఆస్తి హక్కు, రాజకీయాల్లో 9% రిజర్వేషన్లు కల్పించారు. స్త్రీ అభ్యున్నతికి పద్మావతి మహిళా వర్సిటీ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ బాటలోనే మహిళాభ్యున్నతికి చంద్రబాబు గారు బాటలు వేశారు. మహిళలకు స్థానిక సంస్థలు, కళాశాలలు, ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు అమలు చేశారు. డ్వాక్రా ఏర్పాటుతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించారు. ఇప్పుడు లోకేశ్ గారు కూడా మహిళలకు ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు" అని వివరించారు.

అక్రమ అరెస్ట్ తో అభివృద్ధిని అడ్డుకోలేరు


స్కిల్ డెవలప్ మెంట్ లో లక్షలాదిమంది యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించిన చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకోలేనట్టే...అక్రమ అరెస్ట్ తో అభివృద్ధికి కేరాఫ్ అయిన చంద్రబాబు గారిని ఆపలేరు. 

ఐదేళ్లుగా పాలన చేతకాక అన్నింటా విఫలమయ్యారు. నిత్యావసర ధరలు పెంచి పేద, మధ్యతరగతి నడ్డి విరిచారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చి యువత భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టారు. జే ట్యాక్స్ బెదిరింపులు తట్టుకోలేక పారిశ్రామిక వేత్తలు పారిపోయారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకురాగలిగారా...?

మహిళలకు అండగా 'మహాశక్తి'

చంద్రబాబు గారు మహిళా పక్షపాతి. అని, మహిళల కోసమే 'మహాశక్తి' కార్యక్రమం తెచ్చారు. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నేరుగా వారి ఖాతాలోకి జమ చేయాలనే నిర్ణయం గతంలో ఏ రాజకీయ పార్టీ తీసుకోలేదు. 

మొదటిసారిగా చంద్రబాబు దీనికి ప్రణాళిక రచించారు. 'తల్లికి వందనం' పథకం ద్వారా... ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో వారందరికీ డబ్బులు జమ చేస్తారు. దీపం పథకం కింద మూడు సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని సంకల్పించారు.

  • Loading...

More Telugu News